బెల్లంపల్లి, ఏప్రిల్ 5, (జనంసాక్షి )భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ని ఎలాంటి కేసు, వారెంట్ లేకుండా ఇంట్లోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ చేయడాని తీవ్రంగా ఖండిస్తున్నాం అని బెల్లంపల్లి బీజేపీ నాయకులు అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా? తెలంగాణలో నిర్వహించే పరీక్ష పత్రాలు లీక్ అవుతుంటే వాటిని అదుపు చేయడం లేదు, ఆఖరికి పదో తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయి వాట్సాప్ లో వస్తున్న, పట్టించుకోని అసమర్ధ ప్రభుత్వం, కెసిఆర్ రజాకారుల పాలన కొనసాగిస్తున్నారన్నారు. అసమర్ధత పాలనను ఎండగడుతున్న బిజెపిపై అక్కసుతో ఇలాంటి అక్రమ అరెస్టులతో పోరాటాలను, అణిచివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు కెసిఆర్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బెషరతుగా సంజయ్ ని, బీజేపీ నాయకులను, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేశవరెడ్డి, బెల్లంపల్లి అసెంబ్లీ జాయింట్ కన్వీనర్
రాజులాల్ యాదవ్, కన్నెపల్లి అధ్యక్షులు రామన్న యాదవ్,
బెల్లంపల్లి పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి శేణిగారపు శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.




