Wednesday, 4 November 2026

అమ్మఒడి ఆధ్వర్యంలో అన్నదానం.చేస్తున్న అమ్మఒడి సభ్యులు

 

 

 

 

బెల్లంపల్లి, ఏప్రిల్ 25, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద మంగళవారం అమ్మఒడి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమండ్ల మధుకర్ మాట్లాడుతూ అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి బాధను తగ్గించడానికి తమ వంతు సాయంగా అన్నదానం కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ప్రముఖ సినీ గేయ రచయిత, నిర్మాత, జాతీయ కళారత్న తైదల బాపు జన్మదినం సందర్బంగా తైదల బాపు యువసేన సహకారంతో ఆర్డివో శ్యామల దేవి చేతుల మీదుగా 183వ సారి అన్నదానం విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా పల్లేటూరి బస్టాండ్ నందు యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు, బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేశామన్నారు. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు ఈరోజు దాతలందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో తైదల బాపు యువసేన సభ్యులు రేగుల శ్రీనివాస్, తైదల మల్లేష్, ఎరుకల శ్రీనివాస్, శనిగారపు రాంచందర్, పులిగంటి లక్ష్మణ్, అమ్మ ఒడి సభ్యులు హనుమండ్ల సువర్ణ, అమూల్య, నారాయణ, మల్లక్క, రాజేశం, కుడికాల తేజ అశ్విని, రంగ సురేష్, ఎండి యూసుఫ్, చందుపట్ల లింగన్న, పాల్గొన్నారు.