Wednesday, 4 November 2026

చల్లూరు గ్రామనికి చెందిన   చెరువులను మత్స్య శాఖ, ఇరిగేషన్ శాఖ  అధికారులు పరిశీలన

 

 

 

 

 

వీణవంక ఏప్రిల్ 25( జనం సాక్షి)  వీణవంక మండలంలోని చల్లూరు ఇప్పలపల్లి గ్రామాలకు చెందిన మత్స్యకారులకు గత కొంతకాలం నుండి  చెరువుల విషయంలో రెండు గ్రామాల మత్స్యకారులకు  ఘర్షణలు జరుగుతున్నాయి ఇదే విషయంపై చల్లూరు గ్రామానికి చెందిన మత్స్యకారులు మత్స్యశాఖ కమిషనర్ గత నెలరోజు క్రితం దరఖాస్తు చేసుకోగా మంగళవారం రోజున జిల్లా మత్స్య శాఖ, ఇరిగేషన్ అధికారులు. డి ఈ రవీందర్, మత్స్య శాఖ అధికారి దేవేందర్, ఎస్ ఆర్ ఎస్ పి  జేఈ స్వామి దాస్,చల్లూరు గ్రామంలోని చెరువులు,కుంటలు ఎంత విస్తీర్ణంలో,ఎన్ని ఉన్నాయి ఏమైనా కబ్జాకు గురైనయా అనే విషయాన్ని పై ఈరోజు విచారణ చేపట్టడం జరిగింది అనంతరం ఈ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు ఈ నీవేదికను   పంపడం జరుగుతుందని  అన్నారు  అనంతరం మళ్లీ విచారణ చేపడతామని అధికారులు తెలిపారు.అధికారుల వెంట మత్స్యకారులు  ఎలవేన సమ్మయ్య, ఉపాధ్యక్షులు లక్ష్మయ్య, కార్యదర్శి రమేష్, కార్యవర్గ సభ్యులు మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.