జనం సాక్షి, వంగూర్:
మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ గెల్వాలాంబ మాత బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన జిబిఆర్ ట్రస్ట్ చైర్మన్ గువ్వల అమల గెల్వలాంబమాతను దర్శించి బోనం ఎత్తుకొని అమ్మవారికి పూజలు సమర్పించారు. తదుపరి ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలను ఆయురారోగ్యాలతో చల్లగా చూడమని ఆ దేవతను వేడుకున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆడపడుచులు స్థానిక యువకులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.




