Wednesday, 4 November 2026

అమ్మవారి ఆశీస్సులు తాండూర్ ప్రజలందరిపై ఉండాలి.

 మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు.
తాండూరు జులై  (జనంసాక్షి) తాండూరు పట్టణంలోని 13వ వార్డ్ గ్రీన్ సిటీ లోని కొకట్ రోడ్  మిత్రనగర్ కాలనిలో ఆషాఢమాసం సందర్భంగా నిర్వహించిన శ్రీ.పోచమ్మ తల్లి బోనాల జాతర మహోత్సవంలో స్థానిక వార్డ్ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డితో కలసి బోనాల జాతరలో  తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలుపాల్గొన్నారు.
ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి కల్లుసక పోసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది.అనంతరం కాలనీవాసులు వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలుని సన్మానించడం జరిగింది.
అనంతరం కాలనీ వాసులతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకొని వార్డ్ లో మౌళికసదుపాయాలను కల్పిస్తామని కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో వార్డు అభివృద్ధిబాటలో నడిపిస్తామని అన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలని అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తాండూర్ ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరినట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగీతా ఠాకూర్,ప్రభాకర్ గౌడ్,
స్టేషన్ హనుమాన్ దేవాలయ చైర్మన్ సంజీవ్ రావు ,తెరాస పట్టాణ ప్రధానకార్యదర్శి సంతోష్ గౌడ్,నాయకులు ఎర్రం శ్రీధర్,చంటి యాదవ్,సి.రవి,మహేశ్వర రెడ్డి,నాగు ,కాలనీ వాసులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.