అయ్యప్ప ఆలయంలో పూజలు నిర్వహించిన టిపిసిసి నాయకులు కృష్ణారావు
మెట్ పల్లి టౌన్, జనవరి 01,
జనంసాక్షి
మెట్పల్లి పట్టణ కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ధర్మపురి ఆలయ మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కృష్ణారావు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే ఈ సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రికి మనసు మారి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేలా చేయాలని
నియోజకవర్గ ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా అయ్యప్ప కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు,
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెజ్జారపు శ్రీనివాస్ , అందే మారుతి. రాజేష్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
అయ్యప్ప ఆలయంలో పూజలు నిర్వహించిన టిపిసిసి నాయకులు కృష్ణారావు




