Thursday, 5 November 2026

అరవై గంటల భూమికి లక్ష లోన్ ఇవ్వలేదని ఎమోషనల్ బ్లాక్ మెయిల్..

 

 

 

 

 

 

పెద్దూరు సింగిల్ విండో చైర్మన్ బార్కం లక్ష్మి విమర్శలు.

చైర్మన్ పదవికి రాజీనామా-అక్రమాలన్నీ బయట పెడతానని స్పష్ఠీకరణ.

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 16. (జనంసాక్షి). అరవై గుంటల భూమికి లక్ష రూపాయల లోను ఇవ్వలేదని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేష్టున్నరంటూ పెద్దూరు సింగిల్ విండో చైర్మన్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బక్కం లక్ష్మి విమర్శించారు. గురువారం సింగిల్ విండో చైర్మన్ పదవికి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని తొలి మహిళ సింగిల్ విండో చైర్మన్ గా ఉన్న తనపై అధికార పార్టీ డైరెక్టర్లు ముందు నుంచి అవమానాల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అరవై గుంటల భూమికి లక్ష రూపాయల లోను ఇవ్వకపోవడంతోటి తన పట్ల ఎమోషనల్ బ్లాక్బెయిలింగ్ పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. తనపై ఆవిశ్వాసం పెట్టేందుకు క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారంటూ విమర్శించారు. చిత్తశుద్ధితో రైతులకు సేవలందిస్తుంటే అధికార పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని అన్నారు. రాజీనామా చేసిన రైతుల పక్షాన నిలబడతానని అధికార పార్టీ డైరెక్టర్ల అక్రమాలన్నీ బయటపెడతానని అన్నారు. మహిళల పట్ల అధికార పార్టీకి కనీసం గౌరవం లేకుండా పోయిందని మంత్రి కేటీఆర్ అండ చూసుకొని నాయకులు ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని ఆడబిడ్డల ఉసురు తగులుతుందని అన్నారు. సమావేశంలో బిజెపి పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, యువ మోర్చా నాయకులు బూర్ల విష్ణు ప్రసాద్, పలువురు మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు.