Thursday, 5 November 2026

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.
ప్రత్యేక తెలుగు భాష రాష్ట్ర సాధనలో అమరుడైన పొట్టి శ్రీరాములు 122వ జయంతిని నేరేడుచర్లలో వాసవి, వనితా క్లబ్, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా స్థానిక ప్రధాన కూడలి వద్ద పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించి వికలాంగులకు డైపర్లు . పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరీ రాచకొండ విజయలక్ష్మి, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గరిణెఅరుణ, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కందిబండ వాసంతి, వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు కొత్త లక్ష్మణ్ ,వీరవల్లి శ్రీలత ,గజ్జల కోటేశ్వరరావు పోలిశెట్టి సంధ్య ,పోలిశెట్టి అశోక్ ,ఈగ భాగ్యలక్ష్మి, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాచకొండ రామ్మోహన్ రావు మాజీ వాసవి క్లబ్అధ్యక్షులు కందిబండ శ్రీనివాసరావు ఊట్కూరు నటరాజ్, మా శెట్టి లక్ష్మయ్య, వాసవి క్లబ్ సభ్యులు గరినేప్రసాద్, జూలూరు అశోక్ రాచకొండ అంజయ్య, పోలిశెట్టి వెంకటేశ్వర్లు, కందిబండ హరి, తడకమల పరమేశం, ఉప్పల పుల్లయ్యఅనంతుల సత్యనారాయణ, నీలా శ్రీనివాస్ నీల రామ్మూర్తి పాల్వాయి గోపాలకృష్ణ పాల్వాయి ప్రభాకర్ ,గరిణె రాధిక తదితరులు పాల్గొన్నారు