Thursday, 5 November 2026

అరుణ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు: కడియం

Kadium Srihari fire on DK Aruna

హైదరాబాద్ : తాను మహిళలను కించపరిచేలా మాట్లాడలేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. డీకే అరుణ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సభను తప్పుదోవ పట్టించేందుకు అరుణ యత్నిస్తున్నారని తెలిపారు. మైక్‌లు విరగొట్టడం సంప్రదాయమా అని ప్రశ్నించారు కడియం. ఇందుకు ప్రతిస్పందించిన డీకే అరుణ.. మైక్‌లు విరగ్గొడితే మహిళా లోకానికి సిగ్గు చేటు అవుతుందా అని అడిగారు. ఇందుకు శ్రీహరి స్పందిస్తూ.. మైక్‌లు విరగొట్టండి.. బెంచీలు ఎక్కండి.. ఇదేనా సభా సంప్రదాయం అని ప్రశ్నించారు. డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకానికి సిగ్గుచేటు అని మాత్రమే వ్యాఖ్యానించానని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *