వాషింగ్టన్: ప్రయోగ దశలో ఉన్న సెలుమిటినబ్ అనే మందు అరుదైన కంటి క్యాన్సర్ కణాలను నిలువరిస్తున్నట్లు కనుగొన్నామని శనివారం నాడు జరిగిన 49వ అమెరికి క్లినికల్ అంకాలజీ సంఘ సమావేశంలో మెయోరియల్ స్టోన్ కెట్టేరింగ్ క్యాన్సర్ కేసుల్లో ఈ కరమైన క్యాన్సర్ 5 శాతం మందికి ఉంటుంది. కనుగుడ్డు పైన మచ్చలు, కనుపాపల ఆకారంగా మార్పుగా, కనునిప్పి తదితర లక్షణాలు ఉంటాయి. మనుష్యుల పై చేసిన ప్రయోగాల్లో 60 శాతం మందిలో ఈ కాన్సర్ కణాల పరిణామం తగ్గిందని, 15 మందిలో పూర్తిగా నిలువరించగలిగామని ప్రయోగంలో పాలు పంచుకున్న రిచర్డ్ కార్వజల్ తెలిపారు. 84 శాతం మంది రోగుల్లో ఈ క్యాన్సర్‌కు కారణమయ్యే జి.ఎస్.ఎ.జి,జి.ఎస్.ఎ.11జన్యువుల్లో పరివర్తనాలు ఉన్నట్లు కూడా గుర్తించామని రిచర్డ్ వివరించారు.




