Tuesday, 3 November 2026

ఆజాద్‌ నిందలు మోపుతున్నారు: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఎంపీలు మందా, వివేక్‌ చేయాదని ప్రయత్నం లేదని తెరాసలో చేరిన ఎంపీలపై ఆజాద్‌ నిందలు మోపుతున్నారని కేసీఆర్‌ అన్నారు. నిజాం కళాశాల మైదానంలో జరుగుతున్న తెరాస అభినందన సభలో ఆయన మాట్లడుతూ తెలంగాణను అపహస్యం చేసేలా గతం లోనూ ఆజాద్‌ మాట్లాడారన్నారు. ఇప్పుడు మరో నెలలో నిర్ణయం అజాద్‌ చెబితే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని కేసీఆర్‌ అన్నారు. తెరాసాలో నేతల చేరిక పై ప్య్రామిలీ ప్యాకేజీలని ప్రచారం చేస్తున్నారని, వాటిని పట్టించుకోవద్దని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరన్నారు. పార్లమెంటులో పనొ చేసే చప్రాసికి తెలంగాణ బాధ అర్థమైంది కానీ ప్రధానికి అర్థం కాలేదని ఆయన అన్నారు. తెదేపా, వైకాపా అధికారం లోకి వస్తే తెలంగాణ ప్రాంత వ్యక్తి సీఎం కాగలడా తెలంగాణప్రాంతానికి ఆంధ్రా పార్టీ అవసరమా అని ప్రశ్నించారు. జూన్‌ 14న అసెంబ్లీ మటంటడికి లక్షలాదిగా తరలిరావాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *