Thursday, 5 November 2026

అరేబియాలో బతుకమ్మ వేడుకలు

అరేబియా: ఉద్యోగ,ఉపాధి వేటలో ఎల్లలు దాటిన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మరవకుండా ప్రవాస తెలంగాణవాసులు పర్వదినాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో అతిపెద్ద పండుగా అయిన బతుకమ్మ వేడుకల్ని యూనైటీడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌(యూ.ఏ.ఇ)లో ఎమిరెట్స్‌ తెలంగాణ సాంస్కృతిక సంఘం(ఇ.టి.సి.ఎ) నేతృత్వంలో కన్నుల పండువగా నిర్వహించారు. అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఆల్‌ మమ్జర్‌ ఉద్యానవణంలో 1500మంది తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందినవారు బతుకమ్మ నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు.యూఏఇ లోని 7దేశాల్లో ఉన్నవారితోపాటు ఓమన్‌ నుంచి కూడా ప్రవాస కుటుంబాలు తరలివచ్చిన ఈ వేడుకల్లో పాల్గొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *