Tuesday, 3 November 2026

అర్కండ్ల శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్అర్కండ్ల శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్

శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 27 మండల పరిధి లో అర్కండ్ల  గ్రామంలో సోమవారంశక్తి కేంద్ర ఇంచార్జీ పెసర అర్జున్ అధ్యక్షతన కార్నర్ మీటింగ్   నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి  హాజరై మాట్లాడుతూ…..ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్ని వర్గాల సంక్షేమాని కృషి చేస్తున్నారని అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించి చెప్పటం చేశారు . రాష్ట్రంలో కెసిఆర్ నిరంకుశ పాలన వల్ల బిఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిందని, రానున్నది బిజెపి ప్రభుత్వమేనని తెలిపారు గ్రామాలలో ఎల్ఈడి లైట్స సిసి రోడ్ రైతు వేదికలు వైకుంఠధామాలు లాంటి అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు వల్లనే ఏర్పాటు అవుతున్నాయి ఈ విషయం అందరికీ తెలిసిందే అని పేర్కొన్నారు.కరోనా విపత్తు సమయంలో పేదలు ఎవరు ఆకలితో అల్మటించద్దని మూడేళ్లగా  పేదలకు ఉచిత రేషన్ బియ్యం ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు కిలో ఇవ్వడం జరుగుతుంది అని బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపితం చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని  పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఎంపీటీసీ 2 బిజెపి జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు జంగా జైపాల్ ,మండల జనరల్ సెక్రెటరీ దాసరపు నరేందర్ , Sc మోర్చా మండల అధ్యక్షుడు కనకం సాగర్, మండల్ సోషల్ మీడియా కన్వీనర్ చుక్కల శ్రీకాంత్ ,బూత్ అధ్యక్షులు చిగురు శ్రీనివాస, పరశురాములు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు