కోటగిరి ఫిబ్రవరి 27 జనం సాక్షి:-రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకో వాలని సర్పంచ్ వివేక్ నాయక్ పేర్కొన్నారు.పోతంగ ల్ మండలం జల్లాపల్లి ఆభాది గ్రామంలో సోమవారం స్థానిక సర్పంచ్ వివేక్ నాయక్,ఎంపీడీవో మనోహర్ రెడ్డి,హెల్త్ సూపర్వైజర్ కృష్ణవేణి,ఎంపిటిసి రాములు కలిసి కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం అందత్వ నివారణ కోసం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వ హించి అవసరమైన వారికి అద్దాలు,మందులను ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుం దన్నారు.ఈ శిబిరంలో భాగంగా కంటి శాస్త్ర చికిత్స లు అవసరమైన వారిని గుర్తిస్తున్నామన్నారు.ఈ శిబిరంలో ఉప సర్పంచ్ బీమా,కార్యదర్శి శ్రీ వాణి, వార్డ్ మెంబర్స్ భూక్య,శంకర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి.కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి.సర్పంచ్ వివేక్ నాయక్




