అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపిన గ్రామ పంచాయతీ కార్మికులు

వీర్నపల్లి, జూలై 12 (జనంసాక్షి): ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికులు మండల కేంద్రంలో అర్థనగ్న ప్రదర్శనతో ప్రభుత్వానికి నిరసన తెలిపారు. 7వ రోజు సమ్మెను కొనసాగిస్తూ తమ వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు నర్సయ్య, సురేష్, రవి, శ్రీను, ఎల్లం తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు