Tuesday, 3 November 2026

అర్ధరాత్రి కోతుల ఆహార కేంద్రాన్ని ట్రాక్టర్ తో మొక్కలు దున్నేసిన స్థానిక ప్రజాప్రతినిధి కుమారుడు

రాజంపేట్ జనం సాక్షి జూన్ 28రాజంపేట్ మండల పరిధిలో శేర్ శంకర్ గ్రామంలో మంగళవారం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గ్రామపంచాయతీ పరిధిలోని అర్ధరాత్రి కోతుల ఆహార కేంద్రంలో ట్రాక్టర్ తో దున్నీ మొక్కలు ద్వాంసం చేసిన వారిపైన పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి ఇచ్చిన పిర్యాదు మేరకు దరఖాస్తు తీసుకోవడం జరిగిందని రాజంపేట్ ఎసై రాజు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన స్థానిక ప్రజాప్రతినిది కుమారుడు రమేష్, అతని స్నేహితుడు దేవ్య గ్రామంలోని మూడుమామిళ్ల తండా హాబీటేషన్ లో ఎం ఎఫ్ సి లో ఏర్పాటుచేసిన కోతుల ఆహార కేంద్రం లో చెట్లను ట్రాక్టర్ తో ఇద్దరు వ్యక్తులు ద్వాంసం చేసినట్లు కారోబార్ దూల్య పంచాయితీ కార్యదర్శి భాగ్యలక్ష్మి సమాచారం అందించడం తో వెంటనే కోతుల ఆహార కేంద్రంనికి వెల్లి పరిశీలించగా ఏర్పాటు చేసిన చెట్లను ట్రాక్టర్ ద్వారా తొలగించిన రమేష్, దేవ్య పై రాజంపేట్ పోలీస్ స్టేషన్ లో గ్రామస్తుల ద్వారా పిర్యాదు చెయ్యడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి తెలిపారు ఇచ్చిన దరఖాస్తు ఫిర్యాదు మేరకు ఎంక్వయిరీ చేసి కేసు నమోదు చేస్తామని రాజంపేట్ ఎస్ఐ రాజు పేర్కొన్నారు