Tuesday, 3 November 2026

వరుసగా రెండోసారి… బిజెపి పార్టీ మండల అధ్యక్షుడిగా అజయ్

జనంసాక్షి, కమాన్ పూర్ : భారతీయ జనతా పార్టీ కమాన్ పూర్ మండల అధ్యక్షులుగా వరుసగా రెండవసారి జంగపెళ్లి అజయ్ నియమితులైనారు. మేరకు బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ చేతుల మీదుగా బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ కి, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ కి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ రావుల రాంనాధ్ లకు అజయ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.