Wednesday, 4 November 2026

అర్ధరాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం

అర్ధరాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. రాత్రి ఎకదాటిగా కురిసిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. సికింద్రాబాద్ లోని చిలకలగూడ, మహ్మద్ గూడ, షాబాద్ గూడ, లాలాపేట్, శాంతినగర్, ఇందిరానగర్ బస్తీలను వర్షపు నీరు ముంచెత్తింది. నాలాల సమీపంలోని ఇళ్లలోకి నీరురావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే మంత్రి పద్మారావు ముంపు ప్రాంతాల్లో రాత్రంతా పర్యటించారు. నాలాలా సమీపంలోని ఇండ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో రెస్క్యూ టీమ్స్ ను రంగంలోకి దింపారు. అర్ధరాత్రి దగ్గరుండి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. వర్షంలోనే ముంపు ప్రాంతవాసుల్ని కలిసి ధైర్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *