ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉదృతి పెరుగుతుంది. ప్రస్తుతం 35అడుగులకు నీటిమట్టం చేరుకుంది. అటు ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్ని జలకళను సంతరించుకున్నాయి. తాలిపేరు ప్రాజెక్టు 3గేట్లు ఎత్తివేసి 4వేల క్యూసెక్కుల వరదనీరు కిందకి వదులుతున్నారు.వాజేడు మండలంలోని చీకుపల్లి కాజ్ వే నీటమునిగింది.దీంతో 30గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.అటు వేంసూరు మండలంలో చెరువులు నిండుకుండులా మారాయి.బేతుపల్లి వరద కాల్వ ద్వారా 52 చెరువులకు నీటిని వదులుతున్నారు.
గోదావరికి భారీగా వరద ఉదృతి




