అర్హులందరికీ ఇండ్లను మంజూరు చేస్తాం
ఐటీ మున్సిపల్ భారీ పరిశ్రమ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.
డబుల్ బెడ్రూం ఇండ్లు, మన ఊరు మనబడి కార్యక్రమం పై సమీక్ష
రాజన్నసిరిసిల్ల బ్యూరో. నవంబర్ 29, (జనం సాక్షి)
వచ్చే సంక్రాంతి పండుగ లోగా ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో
జిల్లాలో ఇండ్లు లేని నిరుపేదల లెక్కను శాస్త్రీయంగా తేల్చి వివరాలను అందిస్తే అందరికీ ఇండ్లను మంజూరు చేస్తానని
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు.
మంగళవారం ఆకస్మికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి పర్యటించారు.ఈ సందర్భంగా మంత్రి IDOC లో డబుల్ బెడ్రూం ఇండ్లు, మన ఊరు మనబడి కార్యక్రమం పనుల పురోగతి పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
జిల్లాకు మంజూరైన మొత్తం 6,886 డబుల్ బెడ్రూం ఇండ్లలో 3952 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాగా వాటిలో 3447 ఇండ్ల నిర్మాణం పూర్త అయినట్లు తెలిపారు.
వీటిలో ఇప్పటికే 1394 ఇండ్ల పంపిణీ చేయగా, ఇంకా 1746 ఇండ్లు పంపిణీకి సిద్దంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంత్రికి చెప్పారు.పంపిణీ కి సిద్దంగా ఉన్న ఇండ్లను లాటరీ పద్దతిలో అత్యంత పారదర్శకంగా ఇండ్లను అర్హులకు కేటాయించాలని చెప్పారు. రాజకీయలకు అతీతంగా ఇండ్లు లేని అత్యంత నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేయాలన్నారు.
ఇంకా ప్రారంభం కానీ ఇండ్లను సాధ్యమైనంత త్వరగా గ్రౌండింగ్ చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.మంజూరైన ఇండ్లను గ్రౌండ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలదే అని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి మన ఊరు మనబడి కార్యక్రమం పనుల పురోగతి పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మన ఊరు మనబడి కార్యక్రమ పనుల పురోగతిని జిల్లా విద్యాధికారి ధనాల కూడా రాధా కిషన్ మంత్రికి వివరించారు జిల్లాలో మొత్తం 516 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో 111 ఉన్నత పాఠశాలలు, 336 ప్రాథమిక ,మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. వీటిలో మన ఊరు మనబడి కార్యక్రమం మొదటి విడత క్రింద రూ. 20 కోట్ల 38 లక్షల రూపాయలతో 172 పాఠశాలల్లో 579 ఎలక్ట్రికల్, toilets, అదనపు తరగతి గదులు, మేజర్ , మైనర్ పనులు చేపట్టామన్నారు.
పనులు వివిధ దశలో పురోగతిలో ఉన్నాయని ఆయన మంత్రికి నివేదించారు.
పురోగతిలో ఉన్న పనులను సంక్రాంతి కల్లా పూర్తి చేయాలని మంత్రి జిల్లా విద్యాధికారులను ఆదేశించారు.సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ,తెస్కాబ్ చైర్మన్ కొండూరీ రవీందర్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందంకళా చక్రపాణి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ లు టి శ్రీనివాస్ రావు, పవన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ లు సమ్మయ్య, అన్వేష్, కార్య నిర్వాహక ఇంజనీరు లు శ్రీనివాస్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.




