హైదరాబాద్,మార్చి26 (జనంసాక్షి) : అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు ఇస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అలాగే డీలర్లకు కమిషన్ పెంచయుతామని అన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు ఆహార భద్రత కార్డులపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆహారభద్రత దరఖాస్తుల సర్వే ఇంకా పూర్తికాలేదని, అర్హులెవరైనా ఉంటే ఇంకా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సభ్యులు ఆహార భద్రత కార్డులపై అడిగిన ప్రశ్నలకు ఆహార భద్రత కార్డులు అర్హులందరికీ ఇస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. పూర్తి దరఖాస్తుల సర్వే ఇంకా కాలేదని, అర్హులెవరైనా ఉంటే ఇంకా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి దరఖాస్తు పరిశీలన కాగానే గతంలో లా నాలుగు కిలోలు కాకుండా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని తెలిపారు. దీని కోసం రెండువేల ఆరువందల కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. ప్రభుత్వమే కార్డులు రూ. 5 లేదా, రూ.6కు పర్మినెంట్ కార్డులు త్వరలోనే అందిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి ఐదు కిలోల బియ్యం ఇవ్వాలని నిబంధనలు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం ఆరు కిలోల బియ్యం ఇవ్వడానికి సిద్ధమైందన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యం ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అక్రమాలకు పాల్పడితే అరెస్టులకు దిగుతామని హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని తెలిపారు. రేషన్ డీలర్లకు కమిషన్ పెంచే ఆలోచన ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. అర్బన్ ఏరియాలో దూరం ఉన్న రేషన్ దుకాణాలకు గుర్తించి, రేషన్ కార్డు ఉన్న ఏరియాలో సరకులు అందే విధంగా షాపులు ఏర్పాటు చేస్తామన్నారు. పామోలిన్ ఆయిల్ కేంద్ర ప్రభుత్వం పంపించకపోవడం వల్ల ఇవ్వడం లేదని చెప్పారు. ఎఫ్‌సీఐ హవిూలకు కూడా న్యాయం చేస్తామని తెలిపారు. ఎప్రిల్ ముగింపు వరకు అందరికి పర్మినెంట్ ఆహార భద్రత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. గౌరవ సభ్యుల నియోజకవర్గాల్లో ఎవరికైనా కార్డులు అందకుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఈటెల కోరారు. ఇదిలావుంటే శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. అంతకు ముందు పంటల బీమా తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాట్ సవరణ బిల్లును సభ ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టనున్నారు.
తెలంగాణ శాసనసభలో కాగ్ నివేదిక
తెలంగాణ శాసనసభలో ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. మార్చి 2014తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వం కాగ్ నివేదిక ప్రవేశపెట్టింది.




