హైదరాబాద్,మార్చి26 (జనంసాక్షి) : వరంగల్ జిల్లా చిల్పూర్ గుట్ట వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఇది ఎంతో ప్రాశస్త్యమైన ఆలయమన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ శాసనసభ్యుడు ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు మం/-తరి సమాధానం ఇస్తూ…అతి పురాతనమైన చిలుపూరు గుట్ట వెంకటేశ్వర స్వామి దేవాలయం 60 సంవత్సరాలకు పూర్వం త్రిడండి చినజీయార్ స్వామివారిచే ధ్వజస్థభ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆలయం ప్రాంగణంలో ఉన్న భూమిలో సంత ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంతద్వారా వచ్చిన ఆదాయం దేవాలయంకే కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాల కట్టుబడి ఉన్నామని చెప్పారు. దేవాలయంకు వెళ్లే రోడ్డు వెడల్పు పనులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం కోసం రూ. 2500 నుంచి రూ.6000లకు పెంచే ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉందన్నారు.




