Wednesday, 4 November 2026

ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు చంద్రబాబు అభినందన

హైదరాబాద్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా అభ్యర్థి రాంచందర్‌రావును ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. మంచి ఫలితం వచ్చిందన్నారు. ఇకముందు కూడా ఇలాగే ముందుకు సాగుదామని అన్నారు.  కేంద్రమంత్రి బండారు దత్రాత్రేయ, భాజపా ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్‌ లక్ష్మణ్‌ తదితరులు గురువారం ఉదయం టిడిపి అధినేత చంద్రబాబుతో అసెంబ్లీలో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు చంద్రబాబుకు మిఠాయి తినిపించారు. తన గెలుపునకు టిడిపి నేతలు శాయశక్తులా సహకరించాని రాంచందర్‌రావు అన్నారు. పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *