అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్స్,ఇళ్ల స్థలాలు ఇవ్వండి…
– టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత…
భైంసా రూరల్ జనవరి 02 జనం సాక్షి
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డ్స్,ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డ్స్ అందేలా చూడాలని సోమవారం బైంసామండల తాసిల్దార్ ,ఆర్డీవో కార్యాలయలలో టీయూడబ్ల్యూజే సభ్యులు వినతిపత్రం అందించారు. ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్న నిర్మల్ జిల్లా డిపిఆర్ఓ పై తగు చర్యలు తీసుకోవాలని,అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డ్స్,ఇండ్ల స్థలాలు,డబల్ బెడ్రూమ్స్ అందనియేడల యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని వెల్లడించారు.




