Tuesday, 3 November 2026

కామ్రేడ్ పెనక వెంకన్న (విక్రమ్)సంతాప బహిరంగ సభను జయప్రదం చేయండి

కామ్రేడ్ పెనక వెంకన్న (విక్రమ్)సంతాప బహిరంగ సభను జయప్రదం చేయండి
* సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ

టేకులపల్లి,జనవరి 2( జనం సాక్షి ): సిపిఐ( ఎంఎల్) న్యూడెమోక్రసీ రీజనల్ కమిటీ సభ్యులు, అఖిలభారత రైతు కూలి సంఘం మహా-బాద్ జిల్లా అధ్యక్షుడు,ఆదివాసీ ముద్దుబిడ్డ కామ్రేడ్ పెనక వెంకన్న (విక్రమ్) డిసెంబర్ 16న చేను వద్ద పాముకాటుకు గురై మరణించాడు. కామ్రేడ్ పెనక వెంకన్నకు నివాలర్పిస్తూ సంతాప, బహిరంగ సభను గూడూరు సెంటర్ లో ఈనెల 11న నిర్వహిస్తున్నందున, ఈ సభకు ప్రజలు అధికసంఖ్యలోహాజరుకావాలని కోరుతూ టేకులపల్లి సెంటర్ లో ప్రచార పోస్టర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో న్యూడెమోక్రసీ టేకులపల్లి మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విక్రమ్ జీవితం చిన్ననాటి నుండే విప్లవోద్యమాలతో మిళితమై ఉందని,మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానంతో ఈ దేశ బడుగు బలహీన వర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రకటించి ముందు నడిచాడన్నారు. అనేక సమస్యలను, నిర్బంధాలను ఎదుర్కొని ప్రజల తరఫున దృఢంగా నిలిచిన గొప్ప నాయకుడన్నారు. కామ్రేడ్ విక్రమ్ ఆలోచనంతా అడవి గ్రామాలే అజ్ఞాత జీవితమే ప్రధానంగా ఉండేదని అన్నారు. విక్రమ్ చేను వద్ద పాము కాటుకు గురై మృతి చెందడం పార్టీకి తీరని లోటని ఆవేదన చెందారు. సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నార్త్-ఈస్ట్ తెలంగాణ రీజనల్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 11న గూడూరు లో జరిగే సంతాప బహిరంగ సభ కు హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ, అఖిలభారత రైతుకూలి సంఘం(aikms) టేకులపల్లి మండల నాయకులు ఎట్టి నర్సింహా రావు, గుగులోత్ రామచంద్రు, కీసర వెంకన్న, డేగటి లాలూ, బాణోత్ ధల్సింగ్ తదితరులు పాల్గొన్నారు.