జహీరాబాద్ జనవరి 21( జనం సాక్షి )
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అర్హులైన, ఇళ్ళు లేని పేదలకు ఇవ్వకుండా కొంత మంది ఇళ్లు ఉన్న వాళ్ళకే డబల్ బెడ్ రూంలు ఇవ్వడాన్ని నిరసిస్తూ, తక్షణమే వాటిని రద్దు చేయాలని, అర్హులైన ఇళ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ లేదా ఇంటి స్థలం కేటాయించి ప్రభుత్వం చెప్పిన రకంగా మూడు లక్షలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో తాహశీల్దార్ కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డిఓ కార్యాలయం ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యులు మహిపాల్ మాట్లాడుతూ అసలే ఇల్లు లేని పేదలకు ఇళ్ళు కేటాయించకుండా ఇళ్లు ఉన్న వాళ్లకు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వడం సరైనది కాదని, తక్షణమే వారిని సర్వే చేసి రద్దు చేయాలని ఇళ్లు లేని అర్హులైన పేదలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలన్నారు.. అనంతరం కార్యాలయం ఏవో కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏవో మాట్లాడుతూ అనర్హుల కు వచ్చిన ఇళ్లపై విచారణ,ఇళ్ళు లేని వారికి ఇళ్ళు, లేదా స్థలాల విషయం పై అధికారులకు నివేదిస్తామని, న్యాయం జరిగేలా చూస్తామని అనడంతో ధర్నా విరమించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎండి.సలీమోద్దీన్, బక్కన్న, శాంతమ్మ, యాదుల్, తదితరులు,పేదలు పాల్గొన్నారు.




