Thursday, 5 November 2026

మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా చెక్కు అందజేత

 

జహీరాబాద్ జనవరి 21 (జనం సాక్షి )జహీరాబాద్ నియోజకవర్గం
కోహిర్ మండలం, దిగ్వల్ గ్రామానికి చెందిన పున్యమ్మ భర్త ఎసురత్నం ఇటీవల మరణించడం జరిగింది. వారిది చాలా పేద కుటుంబం ఇంటి పెద్ద చనిపోవడంతో కుటుంబం గడవడం చాలా కష్టంగా మారింది, అని తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అని తమను ఆదుకోవాలని జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ను కోరగా, ఎమ్మెల్యే అధికారులకు మాట్లాడగా వారికి రైతు భీమా కూడా రద్దు అని తెలియడంతో ఆర్థిక, ఆరోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్ళి, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి డి ఎం టి ఎఫ్ ఫండ్ నుండి మంత్రి చేతుల మీదుగా రూ. 5 లక్షలు చెక్కును కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివ కుమార్ అధికారులు సి హెచ్ శ్రీనివాస్ రావు డిఆర్ డి ఓ సంగారెడ్డి, బి నర్సింహ రావు జిల్లా వ్యవసాయ అధికారి, నవీన్ వ్యవసాయ అధికారి తదితరులు ఉన్నారు.