Monday, 2 November 2026

అర్హులైన ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్స్ ఇవ్వండి

 

–

 

 

 

 

 

 

కుంటాల మండలకేంద్రంలో బిజెపి నాయకులు బోస్లె మోహన్ రావ్ పటేల్ ఆధ్వర్యంలో మహాధర్నా…

భైంసా రూరల్ జనవరి 31 జనం సాక్షరాష్ట్ర ప్రభుత్వం ఇంకెన్నాళ్లు ప్రజలను మోసం చేస్తుందని,పేద ప్రజలను మభ్యపెట్టడం మానుకోని, అర్హులకు డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని ముధోల్ నియోజక వర్గ బీజేపీ సీనియర్ నాయకులు బోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు.మంగళవారం కుంటాల మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించి,కుంటాల మండల కార్యాలయం ప్రధానరోడ్డు పై రెండు పడకల ఇండ్లురాని పేద ప్రజలతో కలిసి రాస్తారోకో చేసారు. తహసిల్దార్ రావాలంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపైబైఠాయించారు.అనంతరం ఎమ్మార్వో రాస్తారోకో స్థలానికి రాగా… అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్స్ అందేలా చూడాలని వినతిపత్రం అందిచారు.ఎమ్మార్వో సానుకూలంగా స్పందించారు. అనంతరం మోహన్ రావ్ పటేల్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అర్హులైన నిరుపేదలందరికీ రెండు పడకల గదుల ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పిన కేసీఆర్ 9 సంవత్సరాల పదవీకాలం ముగుస్తున్న పేదలకు మాత్రం ఇచ్చినహామీనెరవేర లేదనిఆ తర్వాత స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. మళ్లీ మాట మార్చి మూడు లక్షలు రూపాయలు ఇస్తామని చెబుతుండడం పేదప్రజలను మభ్యపెట్టి కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో పేదప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అర్హులైన పేద ప్రజలకు రెండు పడక గదుల ఇల్లు ఇచ్చేంతవరకు పోరాటం ఆగదని అన్నారు. ఈ కార్యక్రమంలో కుంటాల మండల బిజెపిసీనియర్ నాయకులు కట్టరవి, కుంటాల మండల పలు గ్రామాల నాయకులు,గాలిరవి,దిలీప్, సుభాష్ పటేల్,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.