Monday, 2 November 2026

విద్యుత్ ఏసీడీ చార్జీలను రద్దు చేయాలి

!

 

 

* సిపిఐ ( ఎంఎల్ ) ప్రజాపంథా డిమాండ్పెనుబల్లి, జనవరి31(జనం సాక్షి)
విద్యుత్ వినియోగదారులపై ఏ సీ డీ పేరుతో ప్రభుత్వం మోపుతున్న అదనపు చార్జీలను రద్దు చేయాలని కోరుతూ సిపిఐ ( ఎంఎల్ ) ప్రజా పంథా పెనుబల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ట్రాన్స్ కో ఏడి కి వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే స్లాబుల పేరుతో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని, 30 రోజుల్లోపు తీయాల్సిన విద్యుత్ బిల్లులను తీయకపోవడం వల్ల కూడా అదునపు భారం పడుతుందన్నారు. విద్యుత్ సంస్థకు ప్రభుత్వం బకాయి ఉన్న ఇరవై వేల కోట్ల అప్పులను తక్షణమే చెల్లించాలని కోరారు. రైతులకు అందజేస్తున్న 24 గంటల విద్యుత్ లో కూడా అపరిమితమైన కోతలు విధిస్తున్నారని విమర్శించారు. విద్యుత్ సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడమే కాక, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బీరెల్లి లాజర్,కట్ల ప్రసాద్,వసంత వెంకటి, మాచిబోయిన వెంకట నరసయ్య,వల్లెబోయిన వెంకటేశ్వర రావు, కవ్వాసి సతీష్,దూల పాల్గొన్నారు.