నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:
రాష్ట్రంలో ఉన్న అర్హులైన ప్రతి జర్నలిస్టుకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కశపోగు జాన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని దేవకి ఫంక్షన్ హాల్ లో జర్నలిస్టు పరశురాంరిసెప్షన్కుహాజరయ్యారు.అనంతరం దళిత జర్నలిస్టుల ముఖ్య నాయకులతో ఒక ప్రైవేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న చిన్న,పెద్ద,మధ్య పత్రిక అనే తేడా లేకుండా పత్రికలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు,హెల్త్ కార్డులు, అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డ్స్ మంజూరు చేస్తామని చెప్పి,తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికీ తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా జర్నలిస్టులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కొన్ని జిల్లాల్లో కేవలం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు భూమి పూజ చేసి వదిలిపెట్టారని,దానిని పెండింగ్ పెట్టకుండా ఇండ్లు నిర్మాణం చేసి జర్నలిస్టులకు అప్పజెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రిడేషన్ కార్డులో కోతలు విధించి పత్రికలో పనిచేస్తున్న నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని,అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్కడేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అక్రిడేషన్ తో సంబంధం లేకుండా పత్రికల్లో పని చేసే ప్రతి జర్నలిస్టుకు కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసే విధంగా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిజాలు నిర్భయంగా రాసే జర్నలిస్టులపై ఆంక్షలు విధించడం తగదని, కొంతమంది తన ఉనికిని కాపాడుకోవడానికి జర్నలిస్టులపై దాడులకు దిగుతున్నారని ఇలాంటి దాడులకు భయపడేది లేదని దాడులు సరైనది కాదని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టుల ఫోరం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు పి. వెంకటస్వామి, జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆవుట శ్రీనివాసులు,దళిత జర్నలిస్టుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సుదర్శన్, దళిత జర్నలిస్టుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, దళిత జర్నలిస్టులు శ్రీనివాసులు తరుణ్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి జర్నలిస్టుకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు భయపడేది లేదు. దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కాశపోగు జాన్.




