డబుల్ బెడ్ రూమ్ హామీ ఎందుకు నెరవేర్చలేదు * మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్*
అలంపూర్ జనం సాక్షి (ఏప్రిల్ 3) అలంపూర్ నియోజకవర్గం లో రెండు పడకల గదుల సంగతి ఏంటి, ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలు ఏమైన్నాయి అని మాజీ అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. సోమవారం అలంపూర్ మండలం లోని క్యాతుర్ గ్రామంలో ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నా డబుల్ బెడ్ రూమ్ పనులను పరిశీలించారు.అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈసందర్బంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ, నిరుపేదలకు రెండు పడకల గదులు ఇస్తాం అని హామీతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వకుండా ఈరోజు ప్రజలను మోసం చేసిందనిఅన్నారు.అలంపూర్ మండలం క్యాతురు కేవలం 20 డబల్ బెడ్ రూమ్ లు పేదలకు కేటాయించక పోవడం పైన టిఆర్ఎస్ పై నిప్పులు చేరిగారు.అలాగే
సిద్దిపేట ,సిరిసిల్ల ,గజ్వేల్ నియోజకవర్గాలలో డబుల్ బెడ్ రూములు నిర్మించి అలంపూర్ లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వకుండా ఎస్సీ నియోజకవర్గాన్ని అవమానం చేశారు అన్నారు .రాష్ట్రంలో ఎక్కడా లేని కడుపేదలు అలంపూర్ లోనే ఉన్నారని, ఇండ్లు లేని నిరుపేదలు ఎందరో ఈ నియోజకవర్గంలో నివాసము చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు అన్నారు.ఇక్కడి ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధులకు కళ్ళు మూసుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అలంపూర్ లో 28 వేల డబుల్ బెడ్ రూమ్ అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి అన్నారు.అలంపూర్ కి 80 డబుల్ బెడ్రూమ్స్ మంజూరు అయితే అందులో 20 కూడా కట్టించలేని దుస్థితిలో ఇక్కడి పాలకులు తయారయ్యారు అన్నారు.
లిక్కర్ దందాలు, ఇసుక దందాలకు, కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారే కానీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పై ఎందుకు ధ్యాస పెట్టడం లేదు అన్నారు.
ఆరు నెలల సమయంలో అధికారం కాంగ్రెస్ కు వస్తుంది, ప్రతి పేదోనికి ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇంటి ఆర్థిక సహాయం అందుతుంది అన్నారు.నియోజకవర్గం లో ఆరు వర్గాలుగా విడిపోయి, అక్రమాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అలంపూర్ అభివృద్ధిపై ఎందుకు దృష్టి లేదని పునరుద్గాటించారు.ఇప్పటికైనా అలంపూర్ టిఆర్ఎస్ నేతలు అధికారులు కళ్ళు తెరిచి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశం లో అలంపూర్ మండల అధ్యక్షుడు అడ్డాకుల రామ్ గోపాల్, వడ్డేపల్లి మండలం బంగారు రామకృష్ణారెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ఎనుముల నాగరాజు, జిల్లా కార్యదర్శి దేవేందర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగ శిరోమణి, వడ్డేపల్లి వైస్ చైర్మన్ సుజాత రామకృష్ణారెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షురాలు సులోచనమ్మ, మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అలంపూర్ నియోజకవర్గం లో రెండు పడకల గదుల సంగతేంటి * నియోజకవర్గం పైన వివక్ష చూపుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం




