Tuesday, 3 November 2026

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

 జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని గోకుల్ నగర్ కురుమ సంఘం భవనం వద్ద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 96వ జయంతి వేడుకలు కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కురుమ కులస్తులు మాట్లాడుతూ.. దొడ్డి కొమరయ్య ఆశ సాధన కోసం కృషి చేయాలని వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి వేడుకలు అధికారికంగా చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కురుమ కురుమ సంఘం అధ్యక్షుడు నరిగే మల్లేష్, ఉపాధ్యక్షుడు కోరే భీరయ్య, గౌరవ అధ్యక్షుడు కొమ్ము చేరాలు కురుమ కులస్తులు, నాయకులు నరిగే సాయిలు, నీల రాజయ్య, నరిగే కొమురయ్య, గోపు మహేందర్, అమ్మ సమయ్య, నరిగే రాయమల్లు, దయ్యాల రాజయ్య, కొమ్ము చంద్రయ్య, గోపు పర్వతాలు, కొమ్మ పవన్, కొమ్ము చిన్న కుమార్, ఉమ్మల్ల కుమార స్వామి, దయ్యాల రమేష్, కుమార్, సాన సురేష్ కురుమ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.