తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి వరకు “తెలంగాణ ప్రగతి.. తెలంగాణ సాధించిన అభివృద్ధి”. అనే అంశంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమ్మేళనం అలరించింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ (బాలికల) ఉన్నత పాఠశాల సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ కవులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న కవులు అభివృద్ధిలో సైతంఎంతో గణనీయమైన పాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమని కొని యాడారు.
మంచిర్యాల జిల్లా కవులు రాసిన కవితలు ఎంతో స్ఫూర్తిని నింపాయని కవులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం కవులను ప్రోత్స హించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కవి సమ్మేళనంఏర్పాటు చేసిందని అన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి కవి సమ్మేళన నిర్వహణ అధికారి ఏస్.యాదయ్య మాట్లాడుతూ కవులు సమాజ అభివృద్ధికి చేసే కృషి ఎంతో గొప్పదని సాహిత్యం వల్లనే సమాజ అభివృద్ధి జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి.పి ఆర్.ఓ, వై. సంపత్ కుమార్, జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు పీ .చౌదరి ,శ్రీనివాస్ సత్యనారాయణమూర్తి, కార్యక్రమంలో కవి సమ్మేళనం సమన్వయకర్త గుండేటి యోగేశ్వర్ చేసిన వ్యాఖ్యానం సభికులను ఎంతగానో ఆకట్టుకుంది .జిల్లా ప్రాంతాలనుంచి కవులు పాల్గొని తమ వచన పద్య కవితా గానాలతో అహుతలను ఆకట్టుకున్నారు.
కవి సమ్మేళనానికి న్యాయవేత్తలుగా పొనగంటి దక్షిణామూర్తి, ల్యాధల్ల గాయత్రి, తోకల రాజేశం రాజేశం వ్యవహరించారు..
ఈ సందర్భంగా 45మంది కవులకు శాలువా, ప్రశంస పత్రం, .నగదు తో సన్మానించి అభినందించారు.




