Wednesday, 4 November 2026

ములుగు జెడ్పీ చైర్మన్‌కు నివాళులర్పించిన పుట్ట మధు

జనంసాక్షి, మంథని : గుండెపోటుతో అకాల మృతి చెందిన ములుగు జిల్లా పరిషత్‌ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీష్‌కు పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ పుట్ట మధూకర్‌ , భూపాల పల్లి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ ఘన నివాళులు అర్పించారు. ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలోని కుసుమ జగదీష్‌ పార్థివ దేహన్ని సందర్శించి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. కుసుమ జగదీష్‌ మృతి పార్టీకి తీరని లోటని, పార్టీ కోసం ప్రజల కోసం నిత్యం ఎంతో కృషి చేసే వారని కొనియాడారు. ఆప్తమిత్రుడైన జగదీష్‌ను కోల్పోవడం చాలాబాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటున్నట్లు తెలిపారు.