Tuesday, 3 November 2026

అలరించిన విద్యార్థుల నృత్యాలు

 

 

 

 

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 27 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని ఉరుసు బైపాస్ రోడ్ లో గల తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన స్కూల్ డే సెలబ్రేషన్ లో పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు ఆద్యంతం ఆహుతులను అలరించాయి. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకు వచ్చిన చిన్నారి జీ తెలుగు ఫేమ్ సాయి వేద వాగ్దేవి పాడిన పాటలు ఉత్సాహాన్ని నింపాయి. అదేవిధంగా పాఠశాలకు చెందిన వివిధ తరగతుల విద్యార్థిని విద్యార్థులు చేసిన పలు శాస్త్రీయ, జానపద, సినిమా నృత్యాలు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగించాయి. తాళ్ల పద్మావతి విద్యాసంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశం తో పాటు పాఠశాల డైరెక్టర్స్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎంతో గొప్పగా విద్య బోధిస్తున్న పాఠశాల గొప్పతనాన్ని చూసి అక్కడికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.