Tuesday, 3 November 2026

అలా డోర్ తెరిచినందుకు హత్య చేశాడు!

వాషింగ్టన్ : అమెరికా ఫుట్బాల్ మాజీ ఆటగాడు ఒ.జె.సింప్సన్ తన భార్యను ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని అతడి ఏజెంట్ మైక్ గిల్బర్ట్ తెలిపాడు. రెండు దశాబ్దాల కిందట జరిగిన హత్య వివరాలను మీడియాకు వివరించాడు. 1994 జూన్ 12 సింప్సన్ తన భార్య నికోలస్ బ్రౌన్ ను హత్య చేసిన విషయంలో సింప్సన్ నిందితుడు. అయితే ఆ రోజు తన భార్యను చూసేందుకు సింపసన్ వెళ్లగా బాయ్ ఫ్రెండ్ వచ్చాడనుకుని నికోలస్ భావించింది. అయితే బాయ్ ఫ్రెండ్ మార్కస్ అల్లెన్ వచ్చి డోర్ కొట్టాడని నికోలస్ భావించి వెంటనే కత్తి తీసుకుంది.

తీవ్ర ఆవేశంలో వచ్చి నికోల్ డోర్ ఓపెన్ చేసింది. కంగారులో ఉన్న నికోలస్ వచ్చింది భర్త అని తెలుసుకునే లోపే దారుణం జరిగిందని పేర్కొన్నాడు. కత్తితో దాడికి దిగిందని గ్రహించిన భర్త సింప్సన్ కు ఏం చేయాలో పాలుపోలేదు. షాక్ నుంచి తేరుకున్న సింప్సన్ తన భార్య నికోల్ ను హత్యచేశాడని అతడి ఏజెంట్ గిల్బర్ట్ వెల్లడించాడు. అయితే ఆ రోజు తన భార్య కత్తి పట్టుకుని డోర్ ఓపెన్ చేయకపోయి ఉంటే హత్య చేసి ఉండేవాడిని కాదని మాజీ ప్లేయర్ సింప్సన్ కూడా చాలాసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. తన డైరీలోనూ సింప్సన్ ఈ ఘటనపై రాసుకున్నట్లు ఏజెంట్ వివరించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *