Tuesday, 3 November 2026

అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచారం

తిరుమల: అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచారం శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేస్తోంది. కాలిబాటలో లక్ష్మీనరసింహ ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాల్లో నమోదయ్యాయి.

ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత(6) మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు.