మునిపల్లి, ఏప్రిల్ 06, జనంసాక్షి: శ్యాం ప్రసాద్ ముఖర్జీ జన్మదిన సందర్భంగా గురువారంనాడు మండలంలోని అల్లాపూర్ గ్రామంలో బీజేపీ జెండాను శక్తి కేంద్రం ఇంచార్జీ శంకరయ్య ఎగురవేశారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ 1980లో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో భారతీయ జనసంఘ్ ను భారతీయ జనతాపార్టీగా మార్చి పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా అవతరించిందని, రెండు పార్లమెంట్ స్థానాల నుంచి ప్రారంభించి ఈ రోజు పరిపూర్ణమైన అధిక్యంతో దేశాన్ని పాలిస్తున్న పార్టీగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమం మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బూత్ కమిటీ అధ్యక్షులు కృష్ణమూర్తి, శేఖర్ యాదవ్, సాయి, వీరేశం, నవీన్ కుమార్, మోహన్, సంగమేశ్వర్, నాయకులు బ్యాగరి మాణికయ్య, మన్నె నవాజ్, బేగరి మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.




