Wednesday, 4 November 2026

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

 

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 6 జనం సాక్షిప్రజా సమస్యలు పరిష్కారానికి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్” పేర్కొన్నారు గురువారం”మీతో నేనుకార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణ పరిధిలోని 3వ వార్డు* మరియు15వ వార్డులో ఉదయం పర్యటించారు.
రైల్వే వంతెన పై విద్యుత్ దీపాలు వెంటనే అమర్చాలని సంబంధిత శాఖ వారిని ఆదేశించారు. 3, 15వ వార్డులలో కొన్ని ప్రదేశాల్లో థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట నూతన స్థంబాలు ఏర్పాటు చేయాలని, కాలనీలల్లో ఇళ్లపై వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని, రోడ్డు మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ మరో ప్రదేశానికి మార్చాలని మరియు తదితర విద్యుత్ సమస్యలను పరిష్కారం చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ తీగలకు తాకుతున్నటువంటి చెట్టు కొమ్మలను నరికివేయాలన్నారు.
కాలనీలల్లో త్రాగునీటి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ నీటి సమస్య రాకుండా చూడాలన్నారు. వార్డులలో అండర్ డ్రైనేజ్ మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు మంజుల ముఖ్యం రెడ్డి అనంత్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు