Wednesday, 4 November 2026

అల్‌ఖైదాకు విధేయతగా ఉంటాం

సిరియా ఉగ్రవాద సంస్థ ‘నుస్రా’ ప్రకటన

డెమాస్కస్‌:తాము అల్‌ఖైదా, ఉగ్రవాద నెట్‌వర్క్‌ అయేమన్‌ ఆల్‌ జవహరికి విధేయతగా ఉంటామని సిరియాలో తిరుగుబాటుదారుల తరపున పోరాడుతున్న ఉగ్రవాద సంస్థ నాయకుడు అబు మహ్మద్‌ ఆల్‌గోలాని ప్రకటించాడు. ఈ సంస్థ నుంచి ఇలాంటి ప్రకటన వెలువడడం ఇదే తొలిసారి. ఈ విజయాన్ని తెలియజేస్తూ బుధవారం ఒక ఆడియో సందేశాన్ని వడుదల గోలాని విడుదల చేశాడు. అల్‌ఖైదా ఇరాక్‌ బ్రాంచ్‌తోను తమకు సంబందాలు ఉన్నాయని ఈ ఆడియోలో గోలాని ధృవీకరించాడు. సీరియా లోని ఉగ్రవాద సంస్థలతో తాము కలవనున్నట్లు ఇరాక్‌లో అల్‌ఖైదా బ్రాంచ్‌ మంగళవారం ప్రకటించింది. రెండు సంస్థల విలీనంపై మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు. తమకు చెందిన జభాత్‌ ఆల్‌ నుస్రా తన సొంత పేరుతోనే చలామణి అవుతుందని గోలాని ప్రకటించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *