Tuesday, 3 November 2026

అవగాహన సదస్సు

 

 

 

 

 

 

మహా ముత్తారం మే 03( జనం సాక్షి)జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 పై మహా ముత్తారం మండల కేంద్రంలో ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు ఆధ్వర్యంలో మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి రత్నం సుభద్ర గారి అధ్యక్షతన ఏర్పాటుచేసిన మండల స్థాయి అవగాహన కార్యక్రమంలో సఖి సెంటర్ సిఏ గాయత్రి మండల స్థాయి ప్రజాప్రతినిధులకు అధికారులకు వయోవృద్ధుల సంక్షేమ చట్టంపై పూర్తి అవగాహన కల్పించినారు. బుధవారం
ప్రతి ఒక్కరు గ్రామస్థాయిలో అవగాహన కల్పించి మహముత్తారం మండలంలో ఏ వృద్ధులు కూడా హింసకు గురికాకుండా చూసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రత్నం సుభద్ర మాట్లాడుతూ కన్న తల్లిదండ్రులను హింసిస్తే ఎంతటి వారి కైనా శిక్ష తప్పదు అని అన్నారు. కన్న తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను తమ పిల్లలతో సమానంగా చూసుకోవాలని జన్మనిచ్చి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను కడవరకు క్షోభ కు గురి చేయకుండా సంతోష పెట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి లింగమల్ల శారద ,MPTC, శ్రీపతి సురేష్, పి.ఎ. సి .ఎస్ సి చైర్మన్ సోమ శాంత కుమార్, పోలారం సర్పంచులు వి. సరిత, కనుకునూరు సర్పంచ్ లక్ష్మి ,తో పాటు సఖి కేసు వర్కర్ మాదవి, తాసిల్దార్ శ్రీనివాస్,మండల పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత, భాగ్యలక్ష్మి, ఏపిఎం రామకృష్ణ అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.