Tuesday, 3 November 2026

దొరికిన ఫోన్ అందజేసిన ఎస్​ఐ రాజశేఖర్​

 

 

 

 

మునిపల్లి, మే 03, జనంసాక్షి: ​మండలంలోని పెద్దలోడి గ్రామానికి చెందిన కలాల్​ నరేందర్​ గౌడ్​ తన ఫోన్ (రూ.25వేల విలువ చేసే వన్​ ప్లస్​ నార్డ్ ) ను గత ఏడాది పెద్దలోడి గ్రామంలో పోగొట్టుకున్నాడు. అయితే అప్పట్లో ఆన్​లైన్​ ద్వారా మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటి రిజిస్టర్ (సిఈఐఆర్) ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్​ను బుధవారం నాడు బాధితునికి స్థానిక ఎస్​ఐ రాజేశేఖర్​ అందజేశారు. ఈ సందర్బంగా ఎస్​ఐ మాట్లాడుతూ ఎక్కడైతే ఫోన్లు దొంగలించినా.. ఫోన్లు పోగొట్టుకున్న వారు తమ దృష్టికి తీసుకు వస్తే సిఈఐఆర్ ద్వారా మొబైల్​ను కనుక్కోవడం జరుగుతుందన్నారు. అలాగే ఫోన్లు పోయాయని, ఎవరు అధైర్య పడొద్దని సిఈఐఆర్​తో కనుకునేందుకు అవకాశం ఉందన్నారు. అనంతరం పోన్​ దొరికేందుకు కృషి చేసిన ఎస్​ఐ రాజశేఖర్​కు, పోలీస్​ సిబ్బందికి బాధితుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.