హైదరాబాద్, సెప్టెంబరు 4 : అవినీతిపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శాసనసభలో వైసీపీ వాయిదా తీర్మానంపై అచ్చెన్నాయుడుతోపాటు పలువురు మాట్లాడారు. ఓటుకు నోటు కేసును ఏపీ అసెంబ్లీలో ప్రస్థావించాలని జగన్‌కు కేసీఆర్ ఫోన్ చేశారని మంత్రి ఆరోపించారు. కేసీఆర్ ఫోన్ చేస్తే జగన్ వాయిదా తీర్మానం ఇచ్చారని ఆయన విమర్శించారు. జగన్ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర పన్నాడని మంత్రి రావెల కిశోర్‌బాబు ఆరోపించారు. వైసీపీ టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కైనట్లు తమ వద్ద ఆధారాలున్నాయని చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. సభా సమయాన్ని వృథా చేయాలని వైసీపీ ప్రయత్నిస్తుందని కాల్వ ఆరోపించారు. పక్క రాష్ట్ర సీఎంతో జగన్ కుమ్మక్కై ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని కుట్ర పన్నారని ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు. కేసీఆర్ డైరెక్షన్‌లోనే జగన్ యాక్ట్ చేస్తున్నారని ఆయన విమర్శించారు




