Tuesday, 3 November 2026

నిత్యావసర వస్తువుల ధరలపై అసెంబ్లీలో చర్చ

u42vs4beహైదరాబాద్‌, సెప్టెంబరు 4 : ఏపీ అసెంబ్లీలో చివరి రోజు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చించనున్నారు. నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో వైసీపీ ఓటుకు నోటు కేసుపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో ప్లకార్డులతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దని స్పీకర్‌ వైసీపీ సభ్యులను కోరారు. వైసీపీ సభ్యుల ఆందోళనపై మంత్రి కిశోర్‌బాబు, చీఫ్‌విప్‌ కాల్వ శ్రీనివాసులు మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *