అవిశ్వాసంకు మద్దతివ్వండి
– కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలకు చంద్రబాబు లేఖ
– అన్నిపార్టీల మద్దతు కోరండి
– పార్లమెంట్లో చర్చించేందుకు 15నిమిషాల కంటే ఎక్కువ సమయం కోరండి
– ఏపీ హావిూలపై సభలో గట్టిగా నిలదీయండి
– కుదిరితే చర్చను విూరే ప్రారంభించండి
– చర్చలో మాట్లాడటానికి గల్లాజయదేవ్, రామ్మోహన్నాయుడు, కేశినేని నాని సిద్ధంకండి
– వీడియోకాన్ఫరెన్స్‌లో తెదేపా ఎంపీలకు బాబు దిశానిర్దేశం
అమరావతి, జులై19(జనం సాక్షి) : లోక్‌సభలో జరిగే అవిశ్వాసానికి మద్దతు కూడగట్టే పనిలో టీడీపీ ఉంది. పార్టీ ఎంపీలతో పాటూ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రంగంలోకి దిగారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల మద్దతు కోరుతూ ఆయన లేఖ రాశారు. అవిశ్వాసానికి మద్దతు తెలపాలని అన్ని పార్టీల అధినేతలకు విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాటం చేస్తున్నామని.. తమతో కలిసి రావాలని కోరారు. ప్రత్యేక¬దా, రైల్వేజోన్, స్టీల్‌ప్లాంట్, రెవెన్యూ లోటు సహా మిగిలిన విభజన హావిూల విషయంలో కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రస్తవిస్తూ.. లేఖలో ప్రస్తావించారు. 2014 ఎన్నికల హావిూలను నెరవేర్చకుండా ఏపీని భాజపా మోసం చేసిందన్న చంద్రబాబు, తిరుపతి, నెల్లూరు సభల్లో ¬దాపై ప్రధాని అభ్యర్థిగా మోదీ ఇచ్చిన హావిూ నెరవేర్చలేదని సీఎం లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక ¬దాతో పాటు 18 అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని.. విభజన హక్కుల సాధన కోసమే అవిశ్వాసం నోటీసు ఇచ్చామన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకే అవిశ్వాసం నోటీసులిచ్చామని.. అవిశ్వాసానికి అందరూ మద్దతు
తెలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలో కోరారు.
ఏపీ హావిూలపై సభలో నిలదీయండి..
మరోవైపు ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాసంపై జరిగే చర్చపై దిశా నిర్దేశం చేశారు. ఈ చర్చలో ఏపీకి హావిూలపై గట్టిగా నిలదీయాలన్నారు. చర్చ 7 గంటలు జరిగే అవకాశం ఉందని.. సభలో మాట్లాడేందుకు టీడీపీకి 15 నిమిషాల సమయం వస్తుందన్నారు. 15 నిమిషాలు కాకుండా మరింత సమయం ఇవ్వాలని స్పీకర్‌పై ఒత్తిడి తేవాలని సూచించారు. కుదిరితే అవిశ్వాసంపై చర్చను టీడీపీనే ప్రారంభిస్తే ఇంకా మంచిదన్నారు. తీర్మానంపై చర్చలో మాట్లాడటానికి ఎంపీలు గల్లాజయదేవ్, రామ్మోహన్నాయుడు, కేశినేని నాని సిద్ధం కావాలని చెప్పారట. అవిశ్వాస తీర్మానంపై చర్చను టీడీపీనే ప్రారంభించాలని తెలిపారు. చర్చ ముగింపు కూడా టీడీపీతోనే జరగాలని ఎంపీలకు సీఎం సూచనలు చేశారు. విభజన చట్టంలో ఉన్న 19 అంశాలపై విస్తృతంగా చర్చించాలని, మద్దతిచ్చే అన్ని పార్టీల నేతలతో మాట్లాడాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్ వేదికగా మాట్లాడాలని, పలువురి సంఘీభావం కోరాలన్నారు.