అసాంఘిక శక్తులకు సహకరిస్తే చర్యలు తప్పవు
వేమనపల్లి,డిసెంబర్04,(జనంసాక్షి):
రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశానుసారం మంచిర్యాల ఇన్చార్జ్ డిసిపి అఖిల్ మహాజన్,జైపూర్ ఏసీపీ గోపతి నరేందర్ సూచనల మేరకు ఈనెల 8 వరకు కొనసాగుతున్న మావోయిస్టు ప్లీనరీ సమావేశాల సందర్భంగా మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని చెన్నూరు రూరల్ సీఐ చుంచు విద్యాసాగర్ హెచ్చరించారు.చెన్నూరు రూరల్ సర్కిల్ పరిధిలోని నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరులకు సిఐ విద్యాసాగర్,నీల్వాయి ఎస్ఐ గోపతి నరేష్ కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐ విద్యాసాగర్ మాట్లాడుతూ మావోలకు ఎవ్వరు సహకరించకూడదని,మావోల సమాచారం ఏమి తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు సహకరించే వ్యక్తులపై గట్టి నిఘా ఉంటుందని, శాంతిభద్రతలకు భంగం కలిగించిన,మావోలకు ఆశ్రయం కల్పించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరులు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.సంఘవిద్రోహక శక్తులకు సహకరించవద్దని యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు అన్నారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని,మీ భద్రత మా బాద్యతని ప్రజలకు తెలియజేశారు.




