ఆదర్శప్రాయుడు అంబేద్కర్
శంకరపట్నం: జనం సాక్షి డిసెంబర్ 4
కేశపట్నం మండలం కల్వల గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో హాజరైన THR టీం, మరియు TRSV నాయకులు హరీష్ వర్మ అప్పని మాట్లాడుతూ భారత దేశంలో స్వేచ్ఛ సమానత్వంతో జీవిస్తున్న ప్రతి ఒక్కరు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూలంగానే అని గుర్తుంచుకోవాలని కొనియాడారు అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి గల కారణం కూడా ఆనాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు చిన్న రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం ఏర్పాటు జరిగిందని కాబట్టి ఎప్పుడు తన ఆశయ సాధనాలను ఆలోచన విధానాలను పునికి పుచ్చుకొని యువతరం ముందుకు నడవాలని కోరారు దానితోపాటు నేడు తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ గారు ఆలోచన విధానాలను ముందుకు తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషిస్తూ ప్రజాసేవ ధ్యేయంగా ప్రజల మనుషులను గెలిచిన ప్రజా నాయకుడిగా పేరుగాంచిన తన్నీరు హరీష్ రావు గారి టీముగా అంబేద్కర్ గారి మరియు హరీష్ అన్న గారి అడుగుజాడల్లో నడుస్తూ అణగారిన వర్గా ప్రజల కోసం చేయూతనివ్వడంలో మా వంతుగా మేము కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాట్రేవుల అజయ్ గజ్జల శ్రీకాంత్, కొలిశెట్టి కొండల్, కోరే రవి,యార సుమన్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు




