Wednesday, 4 November 2026

అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి కలెక్టర్ సముదాయంలోని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో కార్మిక శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి పాల్గొన్నారు. ఈ సమావేశంలో రిజిస్టర్ అయిన భవన నిర్మాణ కార్మికులకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి కార్మికులకు రక్తపోటుపరీక్ష, రక్త చక్కెర పరీక్ష ,చెవి పరీక్ష , కంటి పరీక్ష, ఊపిరితిత్తుల పరీక్ష, రక్త మూత్ర పరీక్షలు 50 రకాల టెస్టులు నిర్వహిస్తామని ఈ వారంలో జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, నియోజకవర్గాలలో క్యాంపులు నిర్వహిస్తామని తద్వారా మండల కేంద్రాలలో నిర్వహిస్తామని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కోటేశ్వర్లు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శ్రీకాంత్ చెప్పారని స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ కే షరీఫ్, రాజు, లక్ష్మీనారాయణ, సుధాకర్, యేసుదాసు, మధుకర్, తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు.