Wednesday, 4 November 2026

ఘనంగా రామకృష్ణ రాజు వర్ధంతి సభ

 

 

 

 

టేకులపల్లి, ఏప్రిల్ 19(జనం సాక్షి): టేకులపల్లి మండలకేంద్రంలో టి ఎస్ యు టి ఎఫ్ జిల్లా మాజీ ఆడిట్ కమిటీ కన్వీనర్ రాళ్ల బండి రామకృష్ణ రాజు 2 వ వర్ధంతి సభను టిఎస్ యుటిఎఫ్ టేకులపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సభలో ముందుగా ఉపాధ్యాయులందరు రామకృష్ణ రాజు కు పూలమాల వేసి ఘనం గా నివాలార్పించినారు. ఈ సందర్భంగా వర్ధంతి సభకు హాజరైన టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు మాట్లాడుతూ రామకృష్ణ రాజు ఎంతో ఆర్ధిక క్రమశిక్షణ కలిగిన మనిషి ఆర్ధిక క్రమశిక్షణ కలిగిన నాయకుడు కాబట్టే జిల్లా ఆర్ధిక భాద్యతలు వారికి ఇవ్వడం జరిగిందని అన్నారు.మండల విద్యాశాఖ అధికారి ఠాకూర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల మీద అనేక సందర్భాలలో తన దగ్గరికి వచ్చి పరిస్కార మార్గాలు చూపే వారన్నారు.చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరింపబడతాయని, సూచనలు చేసేవరన్నారు.తాను పాఠశాలను చక్కగా తీర్చిద్దేవారన్నారు.జిల్లా అధ్యక్షులు బి.కిషోర్ సింగ్,జిల్లా ప్రధాన కార్యదర్శి నంది కృష్ణ మాట్లాడుతూ క్రమశిక్షణకు, నిబద్ధతకు మారు పేరుగా రామకృష్ణ రాజు మెలిగేవారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వరలక్ష్మి, జిల్లా కోశాధికారి ఎస్వీ జిల్లా కార్యదర్శులు హతి రామ్,పద్మారాణి, బిక్కు,మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మంగతాయి, బి.నరసింహారావు, మాన్సింగ్,జానకి,రాంజీ రమేష్,రాంచందర్, నాగు నాయక్ ,వీరన్న, తిరుపతి,రవి కె. వి, సుజాత, తదితరులు పాలుగోన్నారు.