హైదరాబాద్, (మార్చి 7): రాష్ట్ర అసెంబ్లీలో ఇదో బ్లాక్ డే అని టీ.టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనను టీఆర్‌ఎస్, ఎంఐఎంలు వక్రీకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ ఘనపై వీడియోక్లిప్పింగ్‌లు చూసి చర్యలు తీసుకోవాని ఆయన కోరారు. తమపై టీఆర్‌ఎస్ సభ్యులు దాడి చేసినందునే తాము బెంచీలు ఎక్కామని, మార్షల్స్ తమను గట్టిగా పట్టుకున్నారని ఆయన ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాల్సిందే అని ఆయన పట్టుబట్టారు. టీఆర్‌ఎస్ సభ్యులు ఫిరాయింపుదార్ల విషయాన్ని స్పీకర్‌కు వదిలేద్దామంటున్నారని, కానీ, అంతకు ముందు ఏబీఎన్, టీవీ9ల విషయంలో స్పీకర్ స్పందించలేదని ఆయన అన్నారు. తలసానిని బర్తరఫ్ చేయాల్సిందేనని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.




